విజయ్ దేవరకొండ సినిమా కోసం గోవాకి పూరి
- పూరి నెక్స్ట్ మూవీ విజయ్ దేవరకొండతో
- స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పూరి
- త్వరలోనే సెట్స్ పైకి
చాలా వేగంగా కథలను తయారు చేయడంలోను .. స్క్రిప్ట్ ను పూర్తి చేయడంలోను పూరి జగన్నాథ్ సిద్ధహస్తుడు. తన కొత్త సినిమాకి స్క్రిప్ట్ ను రెడీ చేయడానికి ఆయన ఎక్కువగా బ్యాంకాక్ వెళుతుంటాడు. అప్పుడప్పుడు గోవా కూడా వెళుతుంటాడు. బ్యాంకాక్ తరువాత ఆయనకి బాగా నచ్చిన ప్రదేశం గోవానే. అందువల్లనే అక్కడ తన సినిమాకి సంబంధించిన సీన్ ఒకటైనా తీస్తుంటాడు.
ఇప్పుడు తన తాజా చిత్రం కోసం ఆయన గోవా వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన తదుపరి సినిమా విజయ్ దేవరకొండతో ఉండనుంది. ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేయడానికి ఆయన అక్కడికి వెళుతున్నాడు. బౌండ్ స్క్రిప్ట్ తోనే ఆయన అక్కడి నుంచి తిరిగి వస్తాడని అంటున్నారు. ప్రస్తుతం క్రాంతిమాధవ్ తో విజయ్ దేవరకొండ చేస్తోన్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా పూర్తికాగానే, పూరి ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.